ELECTION COMMISSION: కప్పు టీ రూ.6, సమోసా రూ.6.. పూల దండ రూ.16.. యూపీలో అభ్యర్థులకు ఈసీ ధరల పట్టిక

  • ఒక బ్రేక్ ఫాస్ట్ రూ.37
  • ముగ్గురు డప్పులు కొట్టే వారికి రూ.1,575
  • ఒక అభ్యర్థి ప్రచార ఖర్చు పరిమితి రూ.40 లక్షలు
ELECTION COMMISSION SETS RATES FOR CONTESTANTS

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి ధరల పట్టికను లక్నో జిల్లా ఎలక్షన్ అధికారి విడుదల చేశారు. ఒక కప్పు టీ రూ.6, ఒక సమోసా రూ.6గా ఈసీ నిర్ణయించింది. అలాగే, నాలుగు పూరీలు, ఒక స్వీట్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ ధరను రూ.37గా ఖరారు చేసింది.

మామూలుగా ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడం తెలిసిందే. ఈ ఖర్చుకు పరిమితి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.40 లక్షలకు మించి ఖర్చు పెట్టడానికి లేదు. పోటీ చేసే అభ్యర్థుల ఆర్థిక పరిస్థితులు వారి గెలుపు, ఓటములను ప్రభావితం చేయరాదన్నది ఈ నిబంధన ఉద్దేశ్యం.

ఎంఆర్పీ ధరపై మినరల్ వాటర్ ను కొనుగోలు చేసుకోవచ్చు. మెడలో వేసే పూలదండకు రూ.16, ముగ్గురు డ్రమ్ములు వాయించే వారికి రోజుకు రూ.1,575 ఇచ్చుకోవచ్చు. కార్లను అద్దెకు తీసుకుంటే.. బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్ అయితే నిత్యం రూ.21,000, పజెరో స్పోర్ట్ కు రూ.12,600, ఇన్నోవా, ఫార్చ్యూనర్, క్వాలిస్ కు రూ.2,310 చొప్పున రోజువారీ ఖర్చు పెట్టుకోవచ్చు. అభ్యర్థులు తమ ప్రచార ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాలి. అందులో ఈసీ నిర్ణయించిన రేట్లను ప్రామాణికంగా తీసుకుంటారు.

More Telugu News