night shifts: రాత్రి షిఫ్ట్ లతో ఆరోగ్యానికి ముప్పే అంటున్న నిపుణులు!

  • నైట్ ఉద్యోగాలతో ఆహారం తీసుకోవడం ఎక్కువ
  • దాంతో కొలెస్టరాల్, గ్లూకోజ్ పెరిగిపోతాయి 
  • గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది 
  • పగటి పూట ఆహారమే ఆరోగ్యానికి మంచిది
Chronic night shifts irregular meals cause blood sugar spike obesity early dementia

ప్రపంచం మారిపోతోంది. రాత్రి పూట చేయాల్సిన ఉద్యోగాలు ప్రపంచీకరణలో భాగంగా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఐటీ రంగం, ఫార్మా, తయారీ రంగంలో రాత్రి షిప్ట్ లు కనిపిస్తుంటాయి. కానీ, రాత్రిపూట ఉద్యోగాలతో ఆరోగ్యానికి ఎన్నో రిస్క్ లు ఉంటున్నాయని, ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతుందని, మరణాల రేటు ఎక్కువగా ఉంటోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎందుకని?

నైట్ షిప్ట్, మారిపోయే షిప్ట్ లతో ఆల్జీమర్స్, డిమెన్షియా సమస్యల బారిన పడతారని, వీటికి, మరణాలకు మధ్య సంబంధం ఉందని పరిశోధకులు గుర్తించారు. ‘‘నైట్ షిప్ట్ కారణంగా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే అది అధిక సీరమ్ టోటల్ కొలెస్టరాల్, ఎల్ డీఎల్ పెరిగేందుకు దారితీస్తుంది. నైట్ షిప్ట్ పనుల వల్ల సర్కాడియన్ క్లాక్ లో మార్పులతో సీ రియాక్టివ్ ప్రొటీన్ (రక్తనాళాల్లో వాపు), బ్లడ్ ప్రెజర్ పెరిగిపోతాయి. దీంతో గుండె జబ్బులు, మధుమేహం రిస్క్ ఏర్పడతాయి’’ అని డాక్టర్ గ్రెగర్ తెలిపారు. మన శరీరాలు రాత్రి పూట ఆహారం తీసుకోవడానికి వీలుగా తయారైనవి కావన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇలా చేస్తే బెటర్

* రాత్రి షిఫ్టుల్లోని వారు ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు ఆహార సేవనాన్ని పరిమితం చేసుకోవాలి. వీలైతే తక్కువ తీసుకోవాలి.

* నైట్ షిప్ట్ చేసి ఉదయం ఇంటికి చేరుకున్న తర్వాత అధిక ఫ్యాట్ ఆహార పదార్థాలు కాకుండా ఆరోగ్యకరమైన వాటికి చోటివ్వాలి.

* ఒక స్నాక్ ను ఉదయం 10 గంటలకు తీసుకుంటే.. అదే స్నాక్ రాత్రి 11 గంటలకు తీసుకున్నప్పటితో పోలిస్తే కేలరీలు అధికంగా ఖర్చవుతాయి. రాత్రివేళ స్నాక్ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ స్థాయులు రెండు వారాల్లోనే పెరిగిపోతాయి.

* రిస్క్ అస్సలే వద్దునుకునేవారు రాత్రిపూట నిద్రించే షెడ్యూల్ కు మారిపోవాలి. మన తాతల కాలంలో సూర్యాస్తమయం తర్వాత ఏదీ తినేవారు కాదు, తిరిగి సూర్యోదయం అయిన వెంటనే ఆహారం తీసుకునే వారు.

* బ్రేక్ ఫాస్ట్ మానొద్దు, కావాలంటే రాత్రి పూట ఆహారం తీసుకోకపోయినా ఫర్వాలేదన్నది వైద్యుల అభిప్రాయం. బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వారిలో గుండె జబ్బులు తక్కువగా ఉంటున్నాయట.

More Telugu News