కాజల్ స్థానంలో సోనాల్ చౌహాన్!

19-01-2022 Wed 11:35
  • నాగ్ హీరోగా 'ది ఘోస్ట్'
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వం
  • రంగంలోకి సోనాల్ చౌహన్
  • బాలయ్యతో వరుస సినిమాలు చేసిన బ్యూటీ
The Ghost movie update
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' సినిమాను చేస్తున్నాడు. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఆయన కొత్త లుక్ తో కనిపిస్తున్నారు. కథానాయికగా సోనాల్ చౌహన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ముందుగా ఈ సినిమా కోసం కథానాయికగా కాజల్ ను అనుకున్నారు. అయితే కాజల్ వ్యక్తిగత కారణాల వలన ఆమె ఈ సినిమా చేయలేకపోతోంది. దాంతో ఇంతవరకూ నాయిక కాంబినేషన్ లేని సీన్స్ ను చిత్రీకరిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు హీరో .. హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ షూట్ చేయవలసి ఉంది. అందువలన సోనాల్ చౌహన్ ను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు.

సోనాల్ గ్లామరస్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగా పరిచయమే. బాలకృష్ణతో కలిసి 'లెజెండ్' .. 'డిక్టేటర్' .. 'రూలర్' సినిమాల్లో అందాల సందడి చేసింది. ఆ తరువాత రామ్ 'పండగ చేస్కో' సినిమాలోనూ మెరిసింది. ప్రస్తుతం ఆమె 'ఎఫ్ 3'లోను నటిస్తోంది. ఇక 'ది ఘోస్ట్'లో ఏ స్థాయిలో అందాలు ఆరబోస్తుందో చూడాలి.