ముంబయి డాక్ యార్డులో ప్రమాదం... ముగ్గురి మృతి

18-01-2022 Tue 21:58
  • ఐఎన్ఎస్ రణవీర్ లో పేలుడు
  • 11 మందికి తీవ్ర గాయాలు
  •  ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • ఆయుధాలకు ముప్పు లేదన్న కేంద్ర రక్షణ శాఖ
Three died in Mumbai Naval Dockyard explosion
ముంబయిలోని నావల్ డాక్ యార్డులో ప్రమాదం సంభవించింది. భారత నావికాదళానికి చెందిన డిస్ట్రాయర్ శ్రేణి యుద్ధనౌక ఐఎన్ఎస్ రణవీర్ లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నావికా దళ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, తీవ్రగాయాలపాలైన ముగ్గురు సిబ్బంది మృత్యువాత పడ్డారని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో మరో 11 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని ముంబయిలోని నేవీ ఆసుపత్రికి తరలించారు. నౌకలో చెలరేగిన మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. కాగా, నౌకలో ఉన్న ఆయుధాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది.