ఈ సీఎం వ్యాక్సిన్ తీసుకున్నాడో, లేదో తెలియదు: బండి సంజయ్

18-01-2022 Tue 20:51
  • క్యాబినెట్ భేటీ నిర్వహించిన సీఎం కేసీఆర్
  • కనీసం వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా చెప్పడన్న బండి సంజయ్
  • కేసీఆర్ మానవత్వంలేని మనిషని విమర్శలు
  • జీవో నెం.317 సవరించేవరకు వదిలిపెట్టబోమని స్పష్టీకరణ
Bandi Sanjay slams CM KCR
సీఎం కేసీఆర్ క్యాబినెట్ భేటీ నిర్వహించడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ సీఎం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడో, లేదో తెలియదని వ్యాఖ్యానించారు. కనీసం ప్రజలను వ్యాక్సిన్ తీసుకోమని కూడా చెప్పడని విమర్శించారు. బీజేపీ నిలదీయడం వల్లే గాంధీ ఆసుపత్రిని సందర్శించాడని అన్నారు.

ఇక, జీవో నెం.317 అంశంపైనా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయాయని అన్నారు. జీవో నెం.317ని సవరించేంత వరకు కేసీఆర్ ను వెంటాడతామని స్పష్టం చేశారు. కేవలం కాలయాపన చేసేందుకు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశాడని, చిత్తశుద్ధి ఉంటే జీవో నెం.317పై చర్చించేవాడని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ లో ఏమాత్రం మానవత్వంలేదని విమర్శించారు.