మామయ్యా, మీరు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబుకు కరోనాపై ఎన్టీఆర్ స్పందన

18-01-2022 Tue 20:04
  • చంద్రబాబు, లోకేశ్ లకు కరోనా
  • లోకేశ్ కూడా ఆరోగ్యవంతుడు కావాలని ఆకాంక్షించిన ఎన్టీఆర్   
  • చంద్రబాబు వేగంగా కోలుకోవాలన్న చిరంజీవి, గవర్నర్
NTR wishes Chandrababu get well soon
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ కరోనా బారినపడడం తెలిసిందే. లోకేశ్ కు నిన్న కరోనా పాజిటివ్ రాగా, చంద్రబాబుకు ఇవాళ కరోనా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రకథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికపై స్పందించారు. "చంద్రబాబు మామయ్యా మీరు వేగంగా కోలుకోవాలి" అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. లోకేశ్ కూడా ఆరోగ్యవంతుడు కావాలని ఆకాంక్షించారు. కరోనా నుంచి త్వరగా బయటపడాలని పేర్కొన్నారు.

అటు, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా చంద్రబాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.