'ఖిలాడి' నుంచి కొత్తగా హెచ్ డీ పోస్టర్స్!

18-01-2022 Tue 18:11
  • 'ఖిలాడి'గా రవితేజ
  • ప్రతినాయకుడిగా అర్జున్
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • వచ్చేనెల 11వ తేదీన విడుదల    
Khiladi New Posters
రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాను, వచ్చేనెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి హెచ్ డీ పోస్టర్స్ ను వదిలారు. ఈ పోస్టర్స్ ను చూస్తుంటే .. ఈ సినిమాలో రవితేజ స్టైల్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టుగా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా ద్వారా పరిచయమైన మీనాక్షి చౌదరికి ఈ సినిమాతో కలిసి రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

రవితేజ క్రేజ్ కి తగినట్టుగా .. ఆయనకి గల మాస్ ఫాలోయింగ్ కి తగినట్టుగా సాగే కథ ఇది. అర్జున్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ ఖేడ్కర్ .. ఉన్ని ముకుందన్ .. మురళీశర్మ .. వెన్నెల కిశోర్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.