'గాడిదా... సామాజిక కాదు, వ్యక్తిగత'... బాలయ్య చిరుకోపం.. వీడియో ఇదిగో!

18-01-2022 Tue 17:55
  • ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి
  • తండ్రికి ఘననివాళి అర్పించిన బాలయ్య
  • కరోనా వ్యాప్తి గురించి బాలయ్య వ్యాఖ్యలు
  • వ్యక్తిగత దూరం పాటించాలని పిలుపు
  • సామాజిక దూరమంటూ ఓ వ్యక్తి వ్యాఖ్యలు 
Balakrishna calla a man donkey
ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

నివాళులు అర్పించిన సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ప్రబలుతోందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించాలని పిలుపునిచ్చారు. అయితే, అక్కడున్నవారిలో ఒకరు వ్యక్తిగత కాదు సామాజిక అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తనదైన శైలిలో స్పందించిన బాలయ్య... "గాడిదా... సామాజిక కాదు, వ్యక్తిగత" అంటూ స్పష్టం చేశారు. దాంతో అక్కడున్నవారు నవ్వేశారు.

గతంలో 'సామాజిక దూరం' అనడం పట్ల విస్తృత స్థాయిలో చర్చ జరగడం తెలిసిందే. తర్వాతి క్రమంలో దాన్ని 'భౌతికదూరం' అని పిలుస్తున్నారు. బాలకృష్ణ దాన్నే 'వ్యక్తిగత దూరం' అని పలికారు.