Raj Tarun: రష్మిక రిలీజ్ చేసిన 'స్టాండప్ రాహుల్' సాంగ్ .. చూసేయండి!

Stand Up Rahul movie song released
షార్ట్స్‌లో చూడండి
రాజ్ తరుణ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'స్టాండప్ రాహుల్' సినిమా రూపొందింది. 'కూర్చుంది చాలు' అనేది ట్యాగ్ లైన్. శాంటో దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, నందకుమార్ - భరత్ నిర్మాతలుగా వ్యవహరించారు. రాజ్ తరుణ్ జోడీగా వర్ష బొల్లమ్మ నటించింది.    

'పదా పదమంటోంది పసిప్రాయం .. సదా నిను చేరేటి ఆరాటం .. ఆగే వీల్లేదు కదా' అంటూ ఈ పాట సాగుతోంది. శ్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటకి, రెహ్మాన్ సాహిత్యాన్ని అందించగా .. యాసిన్ నజీర్ ఆలపించాడు. నాయకా నాయికల మధ్య చిగురించిన ప్రేమ భావాల నేపథ్యంలో ఈ పాట సాగుతోంది.

ప్రతి అనుభవం .. అనుభూతిగా మారుతుంటే, మనసు అరలలో వాటిని పదిలపరచుకుంటూ ఈ ప్రేమికులు ముందుకు సాగుతుంటారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రాజ్ తరుణ్ కి, ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
Go Back to Shorts
Raj Tarun
Varsha Bollamma
Stand Up Rahul Movie

More Telugu News