చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు చేసిన అయ్యన్నపాత్రుడు

18-01-2022 Tue 17:26
  • చంద్రబాబుకు కరోనా పాజిటివ్
  • చంద్రబాబుకు కరోనా రావడం బాధాకరమన్న అయ్యన్న
  • నర్సీపట్నం ఆలయంలో కొబ్బరికాయలు కొట్టిన నేత
Ayyanna Patrudu offers prayers for the health of Chandrababu
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కరోనా సోకిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు ఇవాళ కరోనా లక్షణాలు కనిపించాయని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని నర్సీపట్నం అయ్యప్పస్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టినట్టు తెలిపారు. కరోనా నుంచి బయటపడాలని పూజలు చేశామని చెప్పారు.

చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అని, ఆయనకు కరోనా రావడం బాధాకరమని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. చంద్రబాబుకు అయ్యప్పస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని, ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా పాలన చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.