శ్రీదేవి నాకు అక్క కాదు... పిన్ని: ఆలీతో సరదాగా కార్యక్రమంలో మహేశ్వరి

18-01-2022 Tue 17:15
  • అమ్మాయి కాపురం చిత్రంతో తెలుగుతెరకు పరిచయం
  • గులాబీ, పెళ్లి వంటి చిత్రాలతో గుర్తింపు
  • ఆలీతో సరదాగా కార్యక్రమంతో మరోసారి అభిమానుల ముందుకు
Maheswari participates in Ali Tho Saradaga
అమ్మాయి కాపురం చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన మహేశ్వరి తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా అభిమానుల ముందుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. గులాబి, పెళ్లి వంటి హిట్ చిత్రాలతో మహేశ్వరి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అందాల నటి శ్రీదేవికి మహేశ్వరి బంధువు. అప్పట్లో మహేశ్వరిని అందరూ శ్రీదేవి చెల్లెలు (పిన్ని కూతురు) అనుకునేవారు.

ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా ఇన్నాళ్లకు మహేశ్వరి అసలు విషయం చెప్పింది. శ్రీదేవి తనకు అక్క కాదని, ఆమె తనకు పిన్ని అవుతుందని వెల్లడించింది. అయితే తాను ఆమెను అక్కా అని పిలిచేదాన్నని చెప్పింది. కానీ శ్రీదేవి ఇప్పుడు లేదంటే నమ్మబుద్ధి కావడంలేదని పేర్కొంది.

కాగా, మహేశ్వరి హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసేనాటికి ఆమె వయసు 16 సంవత్సరాలే. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన కరుత్తమ్మ చిత్రం మహేశ్వరి కెరీర్ లో తొలి చిత్రం. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో తన కెరీర్ గురించి అనేక ఆసక్తికర సంగతులను ఆమె పంచుకుంది.