గల్లా అశోక్ కు అమేజింగ్ ఎంట్రీ లభించింది: రామ్ చరణ్

18-01-2022 Tue 16:28
  • 'హీరో' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గల్లా అశోక్
  • సినిమాను చాలా ఎంజాయ్ చేశానన్న రామ్ చరణ్
  • అశోక్ తల్లిదండ్రులు గల్లా జయదేవ్, పద్మావతిలకు శుభాకాంక్షలు తెలిపిన చరణ్
Ram Charan response on Galla Ashok Hero movie
సూపర్ స్టార్ కృష్ణ ఇంటి నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ 'హీరో' చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడే గల్లా అశోక్. 'హీరో' చిత్రంలో అశోక్ సరసర అందాల భామ నిధి అగర్వాల్ నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.

ఈ చిత్రంపై టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ... సినిమా చాలా బాగుందని కితాబునిచ్చాడు. 'ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి గల్లా అశోక్ కు ఒక అమేజింగ్ ఎంట్రీ లభించింది. ఈ చిత్రాన్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేశా. గల్లా జయదేవ్ గారు, గల్లా పద్మావతి గారు, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు. మీ అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలి' అని ట్వీట్ చేశాడు.