వైయస్ అవినాశ్ బీజేపీలోకి పోతాడని వివేకా కుటుంబ సభ్యులకు జగన్ చెప్పారు: బీటెక్ రవి

18-01-2022 Tue 13:36
  • వివేకా హత్యతో అవినాశ్, శివశంకర్ రెడ్డిలకు సంబంధం లేదని ప్రమాణం చేయగలరా?
  • జిల్లా ప్రజలకు శివశంకర్ రెడ్డి చరిత్ర తెలుసు
  • వైసీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు మమ్మల్ని అడుగుతున్నారు
Jagan told to YS Viveka family that Avinash will join BJP says BTech Ravi
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు బయటకు వచ్చిన కొన్ని పేర్లు కలకలం రేపుతున్నాయి. మరోవైపు వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సవాల్ విసిరారు. వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు సంబంధం లేదని ఏ దేవుడిపైన అయినా ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు.

 వివేకా కుటుంబ సభ్యులు సీఎం జగన్ వద్దకు వెళ్లి వివేకా హత్య కేసు విషయమై ఒత్తిడి తెచ్చారని... అయితే, అవినాశ్ ను సపోర్ట్ చేయకపోతే ఆయన వైసీపీని వీడి బీజేపీలోకి వెళతాడని వారికి జగన్ చెప్పారని... ఈ విషయం గురించి వివేకా కుటుంబ సభ్యులను అడిగితే చెపుతారని బీటెక్ రవి అన్నారు.

వైసీపీలోకి రావాలంటూ ఇప్పటికీ ఆ పార్టీ నేతలు తమను అడుగుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలకు, కడప జిల్లా ప్రజలకు శివశంకర్ రెడ్డి చరిత్ర తెలుసని అన్నారు. వివేకా హత్య కేసులో తాము ఎక్కడైనా, ఎలాంటి ప్రమాణానికైనా సిద్ధమేనని, వైసీపీ నేతలు సిద్ధమా? అని సవాల్ విసిరారు.