నా సూపర్ హీరో.. కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోవడంపై మహ్మద్ సిరాజ్ భావోద్వేగ భరిత సందేశం

18-01-2022 Tue 13:29
  • నువ్వే నాకు ఎల్లప్పుడూ కెప్టెన్ వి
  • గడ్డు రోజుల్లో నా ట్యాలెంట్ ను గుర్తించావు
  • నన్ను నమ్మిన నువ్వే నాకు పెద్దన్న
  • టెస్ట్, ఆర్సీబీ జెర్సీల్లో ఫొటోలు పోస్ట్ చేసిన హైదరాబాదీ పేసర్
Virat Kohli Is Always Be My Captain Siraj Heartfelt Message
టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వైదొలగడంపై పేసర్ మహ్మద్ సిరాజ్ స్పందించాడు. ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ భరితమైన పోస్టు పెట్టాడు. కోహ్లీనే తనకు ఎల్లప్పుడూ కెప్టెన్ అని అన్నాడు. టెస్ట్ జెర్సీ, ఆర్సీబీ జెర్సీలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి.. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అని చెప్పాడు.

‘‘నా సూపర్ హీరో.. కోహ్లీనే నాకు ఎప్పుడూ కెప్టెన్. నువ్వు ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహానికి నేను కృతజ్ఞతలు చెప్పలేకుండా ఉండలేను. నువ్వే ఎల్లప్పుడూ నాకు పెద్దన్నవు. ఇన్నేళ్లు నాపై ఇంత విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. నేను గడ్డు పరిస్థితుల్లో ఉన్నా నాలో ఉన్న గొప్ప ట్యాలెంట్ ను గుర్తించావు. నువ్వే నాకు ఎల్లప్పుడూ కెప్టెన్ కింగ్ కోహ్లీ’’ అని పేర్కొంటూ కోహ్లీని ట్యాగ్ చేశాడు.

కాగా, సంక్రాంతి పండుగ రోజే తాను టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నానంటూ ప్రకటించి కోహ్లీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ అనూహ్య పరిణామంతో అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ అయింది.