చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం జగన్.. విజయసాయిరెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు!

18-01-2022 Tue 12:11
  • చంద్రబాబు ఆరోగ్యవంతంగా ఉండాలన్న జగన్  
  • ఎన్టీఆర్ వర్ధంతి నాడే రావడం యాదృచ్ఛికమన్న  విజయసాయి
  • బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుంది
  • వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంతకాలం గుర్తుంటుంది  
YS Jagan Wish Chandrababu A Speedy Recovery
టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని జగన్ ఆకాంక్షించారు. అయితే, విజయసాయిరెడ్డి మాత్రం కొంత వ్యంగ్యంగా స్పందించారు.

యాదృచ్ఛికమే అయినా ఎన్టీఆర్ వర్ధంతి నాడే చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరమని ట్వీట్ చేశారు. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిలేగానీ.. టీడీపీ వ్యవస్థాపకుడికి ఆయన పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకూ గుర్తుండిపోతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కాగా, తనకు కరోనా సోకిందని, లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నాయని పేర్కొంటూ చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే క్వారంటైన్ అయిన సంగతి తెలిసిందే. ఇటు ఆయన కుమారుడు నారా లోకేశ్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.