K V Vijayendra Prasad: 'బాహుబలి' రచయిత అందించిన కథతో మరో భారీ చిత్రం!

Vijayendra Prasad is giving his story line Kollywood Industry
  • రచయితగా విజయేంద్ర ప్రసాద్ కి మంచి పేరు
  • ఇతర భాషల్లోను ఆయన స్థానం ప్రత్యేకం
  • ఆయన కథతో పట్టాలెక్కుతున్న మరో సినిమా
  • సన్నాహాలు మొదలు పెట్టిన తమిళ నిర్మాత  

రచయితగా విజయేంద్ర ప్రసాద్ కి అపారమైన అనుభవం ఉంది. ఆయన కథలను అందించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఒక సాధారణ ప్రేక్షకుడిని అలరించాలంటే, ఒక కథలో ఏయే అంశాలు ఉండాలి .. ఎంతవరకూ ఉండాలి .. ఏ విషయాన్ని ఎక్కడ రివీల్ చేయాలనేది ఆయనకి బాగా తెలుసు.

రాజమౌళి సినిమాలకి సంబంధించిన కథలతోనే ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన, ఏ మాత్రం అవకాశం దొరికినా ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలకి కూడా కథలను అందిస్తూ ఉంటారు. కోలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకూ అందరూ ఆయన కథల కోసం వెయిట్ చేస్తుంటారు. అలా ఆయన కథ .. స్క్రీన్ ప్లేను అందించిన ఒక భారీ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళుతోంది.

కోలీవుడ్ సినిమా నిర్మాతలలో శ్రీవారి ఫిలిమ్స్ కి చెందిన రంగనాథన్ ఒకరు. విజయేంద్ర ప్రసాద్ కథ - స్క్రీన్ ప్లేతో ఆయన ఒక సినిమాను నిర్మిస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కొంతసేపటి క్రితమే వచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అందించనున్నట్టు చెప్పారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఉంటుందనుకోవచ్చు. ఈ బ్యానర్ పై క్రితం నెలలో తమిళనాట విడుదలైన 'ఆనందం విలయాడుం వీడు'కి మంచి టాక్ వచ్చింది.

  • Loading...

More Telugu News