varma: వివాహం అనేది పాపిష్టి ఆచారం.. మూర్ఖులే పెళ్లాడుతారు: రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

  • పెద్దలు పెట్టిన పాపిష్టి ఆచారం ఇది
  • నిరంతరం విచారంతో బతికేందుకే
  • ప్రేమను పెళ్లికి మించి వేగంగా చంపేసేది లేదు
  • విడాకులనే సంగీత్ తో సెలబ్రేట్ చేసుకోవాలన్న వర్మ  
ramgopal varma posts controvarsy tweets on marriage

టీవీ, సినిమా రంగానికి చెందిన ‘స్టార్’ దంపతులు ఒక్కొక్కరుగా విడిపోతున్న నేపథ్యంలో.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకంగా వివాహ బంధాన్నే తప్పుబడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన ట్విట్టర్ పేజీపై ఘాటైన పోస్ట్ లు పెట్టారు. వివాహం గురించి ఆయన పోస్ట్ లు ఇలా ఉన్నాయి.

"వివాహంతో కొనితెచ్చుకునే ప్రమాదాల గురించి యువతను హెచ్చరించేందుకు.. స్టార్ విడాకులు మంచి ట్రెండ్ సెట్టర్స్.

విడాకులను సంగీత్ కార్యక్రమంతో వేడుకలా చేసుకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛను పొందుతున్నందుకు.

ఒకరిలోని ప్రమాదకర లక్షణాలను మరొకరు పరీక్షించుకునేందుకే పెళ్లిళ్లు.  

మన దుష్ట పూర్వీకులు సమాజంపై రుద్దిన పాపిష్టి ఆచారమే వివాహం. అసంతృత్తి, విచారంతో నిరంతరం కొనసాగేందుకే ఇది.

ప్రేమను పెళ్లికి మించి వేగంగా చంపేసేది మరేదీ లేదు. సంతోషానికి రహస్యం ఏమిటంటే.. జైలుకు వెళ్లడం లాంటి పెళ్లి చేసుకోవడం కంటే వీలైనంత కాలం ప్రేమిస్తూ ఉండడమే.

పెళ్లిలో ఉండే ప్రేమ ఆ వేడుక జరిగే అన్ని రోజుల కంటే తక్కువే ఉంటుంది. 3 నుంచి 5 రోజులు.

తెలివైన వారు ప్రేమిస్తారు.. మూర్ఖులు పెళ్లి చేసుకుంటారు"

కాగా, తాజాగా తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్యతో విడిపోతున్నట్టు ప్రకటించగా.. ఇటీవలే నాగచైనత్య, సమంత జంట కూడా వేరు కావడం తెలిసిందే. ఈ క్రమంలో వివాహ బంధంపై స్వతహాగా నమ్మకం లేని వర్మ తన అభిప్రాయాల వెల్లడికి దీన్నొక అవకాశంగా తీసుకున్నారు.

More Telugu News