Kamal Haasan: ఆసుపత్రిలో చేరిన కమలహాసన్.,.. ఆందోళనలో అభిమానులు

Kamal Haasan admits in a private hospital in Chennai
  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కమల్
  • మరోసారి ఆసుపత్రిలో చేరడంతో కలకలం
  • సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లిన కమల్ 
  • ఈ సాయంత్రం డిశ్చార్జి అయ్యే అవకాశం
ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కమల్ చేరారన్న వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఇటీవలే అమెరికా వెళ్లి తన దుస్తుల బ్రాండ్ 'హౌస్ ఆఫ్ ఖద్దర్' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక భారత్ కు తిరిగి రాగానే కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో చెన్నై శ్రీరామచంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొన్నారు.

మళ్లీ ఇంతలోనే ఆయన ఆసుపత్రిలో చేరడం కలకలం రేపింది. అయితే, కమల్ సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేరినట్టు వెల్లడైంది. ఈ సాయంత్రం ఆయన డిశ్చార్జి కానున్నారు. కమల్ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. అటు, శంకర్ దర్శకత్వంలో సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన 'ఇండియన్-2' షూటింగ్ లోనూ ఆయన పాల్గొనే అవకాశాలున్నాయి.
Kamal Haasan
Private Hospital
Chennai
Corona Virus
Kollywood
Tamil Nadu

More Telugu News