Raghu Rama Krishna Raju: ఆరోగ్యం బాగోలేదు.. విచారణకు రావడానికి సమయం కావాలి: ఏపీ సీఐడీకి రఘురామ లేఖ

Raghu Rama Krishna Raju writes letter to AP CID stating he health is not good
  • విచారణకు హాజరు కావాలంటూ రఘురాజుకు ఏపీ సీఐడీ నోటీసులు
  • ఢిల్లీకి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యానంటూ సీఐడీకీ రఘురాజు లేఖ
  • అనారోగ్యం వల్ల విచారణకు రాలేనన్న ఎంపీ
విచారణకు హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ముందు హైదరాబాదులోని రఘురాజు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులను అందజేశారు. నోటీసుల్లో పేర్కొన్న దాని ప్రకారం ఈరోజు సీఐడీ విచారణకు రఘురాజు హాజరుకావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీకి రఘురాజు లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల ఈనాటి విచారణకు హాజరు కాలేకపోతున్నానని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యానని తెలిపారు. విచారణకు హాజరు కావడానికి నాలుగు వారాల సమయం కావాలని కోరారు.
Raghu Rama Krishna Raju
YSRCP
AP CID

More Telugu News