Mallu Bhatti Vikramarka: మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్.. రాత్రి అపోలో ఆసుపత్రికి తరలింపు

Mallu Bhatti Vikramarka tests positive for Corona
  • ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందన్న భట్టివిక్రమార్క
  • తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని విన్నపం
  • తనను కలవడానికి ఎవరూ రావద్దని వ్యాఖ్య
కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క కరోనా బారిన పడ్డారు. కరోనా సోకడంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో, నిన్న రాత్రి ఆయనను హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు వైద్యులు అన్ని పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ప్రస్తుతం తన ఆరోగ్య బాగుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తనను కలవడానికి ఎవరూ రావద్దని కోరారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అందరినీ తాను కలుస్తానని తెలిపారు.
Mallu Bhatti Vikramarka
Congress
Corona Virus

More Telugu News