greece: టీకా తీసుకోకపోతే ప్రతీ నెలా రూ.8,500 కట్టాల్సిందే.. గ్రీస్ లో కొత్త నిబంధన

60 plus Citizens Face Monthly Fine For Not Getting Covid Shot In This Country
  • టీకాలు తీసుకోని వారిలో 60 ఏళ్లు పైబడినవారే ఎక్కువ
  • మరణాల రేటు కూడా అధికం
  • అయినా ముందుకు రాని వృద్ధులు
  • జరిమానాతో దారికి రప్పించే యోచన

‘బాబ్బాబు టీకా తోసుకోండి’.. అని రిక్వెస్ట్ చేస్తే ఎవరూ చెవికెక్కించుకోవడం లేదు. దీంతో ఇక లాభం లేదనుకుని 60 ఏళ్లు దాటిన వారిలో టీకా తీసుకోని వారు ప్రతీ నెలా 100 యూరోలు (సుమారు రూ.8,500) జరిమానా కట్టాల్సిందేనంటూ గ్రీస్ సర్కారు హుకుం జారీ చేసింది. సోమవారం నుంచి ఈ నిబంధన అమలు కానుంది. వైద్య రంగంపై ఒత్తిడి తగ్గించడమే గ్రీస్ సర్కారు చర్య వెనుకనున్న ఉద్దేశ్యం.

ప్రధాని కిరియాకోస్ మిట్సోటకిస్ ఈ మేరకు ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. ‘‘60 ఏళ్లు దాటిన వారిలో టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలి. ఫైన్ వేయడానికి ఎంతో సమయం పట్టదు. కానీ, మీ జీవితాలను, మీరు ఎంతగానో ప్రేమించే వారిని కాపాడుకోండి. టీకా సురక్షితమేనని అర్థం చేసుకోండి’’ అని పిలుపునిచ్చారు.

టీకాలు తీసుకోని వారు వైరస్ బారిన పడితే హాస్పిటల్లో చేరాల్సిన రిస్క్ ఎక్కువగా ఉంటోందని గ్రీస్ అధికారులు చెబుతున్నారు. గ్రీస్ లో కరోనా కారణంగా మరణించిన ప్రతి 10 మందిలో 9 మంది 60 ఏళ్లకు పైబడిన వయసువారే. ఆసుపత్రుల్లో చేరుతున్న ఈ వయసు వారిలో ప్రతి 10 మందికి ఎనిమిది మంది టీకాలు తీసుకోని వారు ఉంటున్నారు.

అందుకే, ఇకపై టీకాలు తీసుకోని 60 ఏళ్లు దాటిన వారి నుంచి ప్రతీ నెలా 100 యూరోలను పన్ను అధికారులు వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని హాస్పిటల్స్ కు ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News