Kalyankrishna: 'బంగార్రాజు' దర్శకుడు భారీ ఆఫర్ పట్టేశాడే!

kalyan Krishna New project
  • సంక్రాంతి బరిలోకి దిగిన 'బంగార్రాజు'
  • రికార్డు స్థాయిలో రాబడుతున్న వసూళ్లు
  • మరో హిట్ కొట్టిన కల్యాణ్ కృష్ణ
  • జ్ఞానవేల్ రాజా బ్యానర్లో తదుపరి ప్రాజెక్టు
కొత్త ఏడాది ఆరంభంలోనే దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ భారీ హిట్ కొట్టేశాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బంగార్రాజు' భారీ వసూళ్లను రాబడుతోంది. చాలాకాలం తరువాత నాగార్జునకి మరో హిట్ దొరికింది. కల్యాణ్ కృష్ణ చాలా తక్కువ సమయంలో 'పక్కా పండగ సినిమా' అంటూ ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకుని వచ్చాడు. ఈ సినిమాను గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు.

ఈ నేపథ్యంలో కల్యాణ్ కృష్ణ తదుపరి సినిమా ఎవరితో .. ఏ బ్యానర్లో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన తదుపరి సినిమా తమిళ నిర్మాతతో ఉండనుందనే విషయం తాజాగా ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో జ్ఞానవేల్  రాజా ఒకరు. ఆయన బ్యానర్లో కల్యాణ్ కృష్ణ ఒక సినిమా చేయనున్నాడనే విషయం అధికారికంగా బయటికి వచ్చింది.

ఇక ఈ సినిమాలో కథానాయకుడు ఎవరు? ఎప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవుతుంది? అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. జ్ఞానవేల్ రాజా ఇంతవరకూ తన స్టూడియో గ్రీన్ బ్యానర్ పై సూర్య .. కార్తిలతో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమాలో కూడా వాళ్లిద్దరిలో ఒకరు ఉండే అవకాశం లేకపోలేదు.
Kalyankrishna
Bangarraju Movie
Nagarjuna

More Telugu News