మరోసారి కరోనా బారిన పడిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

16-01-2022 Sun 21:18
  • రాజకీయ నేతలనూ వదలని కరోనా
  • కొన్ని నెలల కిందటే కరోనా నుంచి కోలుకున్న పోచారం
  • తాజాగా రెండోసారి కరోనా
  • హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రిలో చేరిక
Speaker Pocharam Srinivasa Reddy second time infected with corona
కరోనా బారినపడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. దాంతో హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. పోచారం శ్రీనివాసరెడ్డి కొన్నినెలల కిందటే కరోనా బారినపడ్డారు. అటు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు.