హైదరాబాదులో యువకుడ్ని కత్తితో పొడిచిన యువతి

16-01-2022 Sun 20:01
  • లంగర్ హౌస్ ప్రాంతంలో ఘటన
  • కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న జంట
  • తనను దూరం పెడుతున్నాడని ప్రియుడిపై యువతి ఆగ్రహం
Woman stabbed lover in Hyderabad
హైదరాబాదులో ఓ యువకుడిపై యువతి కత్తితో దాడి చేసింది. కృష్ణ అనే యువకుడు ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. వీరు లంగర్ హౌస్ ప్రాంతంలో సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల వీరి మధ్య కలతలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకోకుండా దూరం పెడుతున్నాడని ఆ యువతి ప్రియుడిపై కోపం పెంచుకుంది. తనను మోసం చేస్తున్నాడని నిర్ధారణకు వచ్చిన యువతి కత్తితో కృష్ణపై దాడికి పాల్పడింది.

ఈ ఘటనలో కృష్ణకు గాయాలు కావడంతో అతడిని స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.