అర్ధాంగికి కరోనా రావడంతో ఐసోలేషన్ లో మంత్రి బాలినేని

16-01-2022 Sun 19:29
  • వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి
  • బాలినేని ఇంట్లో కరోనా కలకలం
  • గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కూడా కరోనా
AP Minister Balineni in isolation after his wife tested corona positive
ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో కరోనా కలకలం రేగింది. ఆయన భార్య శచీదేవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అర్ధాంగితో పాటు మంత్రి బాలినేని కూడా హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.

అటు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో నేతలు స్పందిస్తూ, తమను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.