తనకు మూడోసారి కరోనా సోకిందన్న అంబటి రాంబాబు

16-01-2022 Sun 14:36
  • అంబటి రాంబాబుకు మరోసారి పాజిటివ్
  • వీడియో ద్వారా వెల్లడి
  • ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న అంబటి
  • క్వారంటైన్ లో ఉన్నానని వివరణ
Ambati Rambabu tested corona positive for third time
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మళ్లీ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. ఇటీవల భోగి సందర్భంగా ప్రజలతో కలిసి ఆడిపాడారు. ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.

తనకు మళ్లీ కరోనా వచ్చిందన్న విషయాన్ని అంబటి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. మొదట 2020 జులైలో అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత డిసెంబరులో రెండోసారి కూడా కరోనా సోకింది.