ఒక్క నెలలోనే రూ.35,000 కోట్ల బంగారం దిగుమతి
16-01-2022 Sun 14:05
- 2021 డిసెంబర్ లో నమోదు
- 2021 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రెట్టింపు
- రూ. 2.81 లక్షల కోట్ల దిగుమతి
- పెరిగిన వాణిజ్యలోటు
- ధరలు తక్కువగా ఉండడంతో పెరిగిన డిమాండ్

బంగారానికి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. పెట్టుబడులు, ఆభరణాల దృష్ట్యా బంగారానికి డిమాండ్ తగ్గడం లేదని గణాంకాలను చూస్తే తెలుస్తోంది. 2021 డిసెంబర్ లో దేశంలోకి 4.8 బిలియన్ డాలర్ల విలువైన (సుమారు రూ.35,520 కోట్లు) బంగారం దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. 2020 డిసెంబర్ లో 4.5 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) 2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఏకంగా 38 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు (రూ.2,81,200కోట్లు) నమోదైనట్టు వాణిజ్య శాఖ తెలిపింది. కానీ, 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 16.78 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోల్చి చూస్తే రెట్టింపునకు పైగా పెరిగాయి. 2020లో కరోనా మొదటి విడతలో లాక్ డౌన్ ల ప్రభావం బంగారం దిగుమతులు తక్కువగా ఉండడానికి కారణంగా చెప్పుకోవాలి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల కాలంలో పసిడి దిగుమతులు పెరిగినందున వాణిజ్య లోటు 142 బిలియన్ డాలర్లకు విస్తరించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో వాణిజ్య లోటు 61 బిలియన్ డాలర్లుగానే ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా జరగడం, ఆంక్షలు తగ్గిపోవడం, బంగారం ధరలు తక్కువ స్థాయిలో ఉండడం ఇవన్నీ దిగుమతులు పెరిగేందుకు దారితీసిన అంశాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

More Telugu News

తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
10 minutes ago

ఢిల్లీలో అఖిలేశ్ యాదవ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం
33 minutes ago

ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 టర్బో విడుదల
43 minutes ago

ఒమిక్రాన్ బీఏ 4 రెండో కేసు తమిళనాడులో
1 hour ago

దసరా రేసులో నిఖిల్ .. 'స్పై'
2 hours ago

పవన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్!
3 hours ago

కొండెక్కుతోన్న టమాటా ధరలు
3 hours ago
Advertisement
Video News

Sarkaru Vaari Paata team: Unfiltered conversation between Mahesh Babu and fans
9 minutes ago
Advertisement 36

Cong fighting to regain India from BJP-RSS, says Rahul at Cambridge varsity
24 minutes ago

Apart from entertainment, movies should impart knowledge: Venkaiah
51 minutes ago

Yoddha song Telugu teaser from Prithviraj - Akshay Kumar, Manushi
1 hour ago

Pawan Kalyan laughs as power goes off while interacting with media
2 hours ago

Full video song ‘Meenaacchee’ from Bhala Thandhanana ft. Sree Vishnu, Catherine Tresa
3 hours ago

Black official trailer- Aadi Sai Kumar
3 hours ago

KA Paul 'Open Heart With RK'- Promo
4 hours ago

7 AM Telugu News: 21st May 2022
5 hours ago

Case filed against Amitabh, Shah Rukh, Ajay Devgn, Ranveer for promoting ‘Gutkha’: Key details
5 hours ago

CM KCR national tour schedule released
6 hours ago

Elon Musk facing se*ual harassment on a flight attendant
6 hours ago

Zee Mahotsavam 2022 Promo- Venkatesh, Varun Tej, Anil Ravipudi- May 22nd, 6 PM
7 hours ago

Did not start the fight: Superstar Kichcha Sudeep on language row
7 hours ago

9 PM Telugu News- 20th May 2022
15 hours ago

Corona Virus BA 4 variant; First case witnessed in Hyderabad
16 hours ago