విరాట్ కోహ్లీ నిర్ణయంపై బాలీవుడ్ ప్రముఖుల స్పందనలు

16-01-2022 Sun 13:24
  • ఎందుకు ఈ నిర్ణయం?
  • నీలో ఇంకా ఎన్నో ఏళ్ల క్రికెట్ చూడాలి
  • రామ్ పాల్ ట్వీట్
  • గర్వపడేలా చేశావ్
  • రితేష్ దేశ్ ముఖ్ ట్వీట్
  • ఎప్పటికీ రుణపడి ఉంటామన్న సునీల్ శెట్టి
Riteish Deshmukh to Arjun Rampal B Town reacts to Virat Kohli stepping down as India Test captain
టెస్ట్ జట్టు కెప్టెన్ పదవికి విరాట్ కోహ్లీ విరమణ ప్రకటించడంపై క్రికెటర్ల నుంచే కాదు బాలీవుడ్ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

నటుడు, నిర్మాత అర్జున్ రామ్ పాల్ ‘‘ఎందుకు యార్. నీవు ఒక అద్భుతమైన కెప్టెన్. దేశానికి గొప్పగా సేవలు అందించావు. ఇంకా ఎన్నో ఎన్నో ఏళ్ల పాటు సారథిగా నీలో క్రికెట్ చూడాలి. ఈ నిర్ణయం స్వల్ప కాలమేనని ఆశిస్తున్నాను. అయినప్పటికీ, నీ నిర్ణయాన్ని ఎవరైనా గౌరవిస్తారు. ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు అందించినందుకు ధన్యవాదాలు’’అని రామ్ పాల్ ట్వీట్ చేశాడు.

రితేష్ దేశ్ ముఖ్ సైతం.. ‘‘కింగ్ కోహ్లీ అని పిలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నీ సారథ్యంలో భారత్ ఎన్నో శిఖరాలకు చేరింది. ప్రియమైన కోహ్లీ మమ్మల్ని గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు. భారత్ హృదయం కోహ్లీ కోసం కొట్టుకుంటుంది’’ అంటూ దేశ్ ముఖ్ ట్వీట్ పెట్టారు.

సునీల్ శెట్టి స్పందిస్తూ.. ప్రపంచంలో భారత్ ను బలమైన శక్తిగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు. ‘‘కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి. కానీ ఎప్పటికీ రుణపడి ఉంటాం’’అని శెట్టి పేర్కొన్నాడు.