అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ‘రిపబ్లిక్ డే’ ఆఫర్ల విక్రయాలు

16-01-2022 Sun 12:59
  • 17-20 వరకు అమెజాన్ రిపబ్లిక్ డే సేల్
  • 17-22 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్
  • క్రెడిట్ కార్డు చెల్లింపులపై10 శాతం డిస్కౌంట్
Amazon Great Republic Day Sale and Flipkart Big Saving Days 2022 Begins
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఇండియా రిపబ్లిక్ డే ఉత్సవాల పేరుతో ఆఫర్ల విక్రయాల కార్యక్రమాలను ప్రకటించాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ప్రైమ్ సభ్యులకు ఆదివారం నుంచే ఆఫర్ల విక్రయాలు మొదలైనట్టు అమెజాన్ తెలిపింది.  

ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ తగ్గింపు ఇస్తోంది. కనీసం రూ.5,000కు పైన కొనుగోళ్లకు ఈ తగ్గింపు ఆఫర్ వర్తిస్తుంది. నాన్ ఈఎంఐ చెల్లింపులపై రూ.1,250, ఈఎంఐ చెల్లింపులపై రూ.1,500 తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది.

ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 'ఫ్లిప్ కార్ట్ ప్ల‌స్ మెంబ‌ర్ షిప్' ఉన్న‌ వారికి ఆదివారం నుంచే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఐసీఐసీఐ కార్డు చెల్లింపులపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్, వస్త్రాలు, బ్యూటీ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి.