బీచ్‌లో టాప్ లెస్ ఫోర్డ్ జీప్‌లో భార్య‌తో క‌లిసి తిరిగిన బాల‌కృష్ణ‌.. వీడియో వైర‌ల్

16-01-2022 Sun 12:46
  • సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఎంజాయ్
  • చీరాల బీచ్‌లో సందడి
  • స్వ‌యంగా జీప్ న‌డిపిన బాల‌య్య‌
balakrishna video goes viral
సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సినీన‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ తన అక్క పురంధేశ్వ‌రి ఇంటికి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న‌ భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో ప్రకాశం జిల్లా కారంచేడులో ఉన్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా నిన్న‌ గుర్రం ఎక్కి సంద‌డి చేసిన ఆయ‌న బీచ్‌లో త‌న భార్య వ‌సుంధ‌రతో క‌లిసి జీప్‌లో తిరిగిన ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. భార్య‌ను ప‌క్క‌న కూర్చోబెట్టుకుని ఆయ‌న స్వ‌యంగా జీప్ న‌డిపారు.

తన భార్య వసుంధరతో కలిసి చీరాల బీచ్‌లో సందడి చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. టాప్ లెస్ ఫోర్డ్ జీప్‌లో కాసేపు అక్క‌డ తిరిగి, అనంతరం కుటుంబ సభ్యులతో బీచ్‌లో కొద్దిసేపు గడిపారు. బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమా భారీ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. మ‌రోవైపు, ఆహాలో ఆయ‌న వ్యాఖ్యాత‌గా చేసిన అన్‌స్టాప‌బుల్ కార్య‌క్ర‌మం కూడా హిట్ అయింది.