రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోన్న‌ బంగార్రాజు.. 2 రోజుల క‌లెక్ష‌న్ల సునామీ వివ‌రాలివిగో

16-01-2022 Sun 12:28
  • మొన్న విడుద‌లైన‌ బంగార్రాజు
  • రెండో రోజు రూ.13 కోట్ల గ్రాస్
  • నైజాంలో రూ.2.41 కోట్లు, సీడెడ్‌లో రూ.1.66 కోట్లు
  • రెండు రోజుల్లో కలిపి 36 కోట్లు
bangarraju collections
సంక్రాంతికి వ‌చ్చిన సోగ్గాడు రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్నాడు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన 'బంగార్రాజు' సినిమా బాక్సీఫీస్ ను షేక్ చేస్తోంది. కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా మొన్న విడుద‌లైన విష‌యం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ సినిమా రెండో రోజూ రూ. 13 కోట్లు గ్రాస్ రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

నిన్న సంక్రాంతి కావ‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు త‌ర‌లివెళ్లి ఈ సినిమా చూశారు. ఈ సినిమా నైజాంలో రూ. 2.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.66 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 93 లక్షలు రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక‌ ఈస్ట్‌లో రూ. 88 లక్షలు, వెస్ట్‌లో రూ.49 లక్షలు, గుంటూరులో రూ.61 లక్షల గ్రాస్ రాబ‌ట్టింది. కృష్ణాలో రూ.49 లక్షలు, నెల్లూరులో రూ.32 లక్షలు వ‌సూలు చేసింది.
                       
బంగార్రాజుకు వ‌స్తోన్న క‌లెక్ష‌న్లు చూసి ఈ సినిమా యూనిట్ సంబ‌రాల్లో మునిగిపోతోంది. రెండు రోజుల రికార్డులు క‌లిపి చూస్తే నైజాంలో రూ. 4.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.20 కోట్లు రాబ‌ట్టింది ఈ సినిమా. ఈస్ట్‌లో రూ.1.75 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.39 కోట్లు, గుంటూరులో రూ. 1.79 కోట్లు వ‌చ్చాయి. కృష్ణాలో రూ.93 లక్షలు, నెల్లూరులో రూ. 86 లక్షలు రాబ‌ట్టింది. మొత్తానికి రెండు రోజుల్లో కలిపి రూ.36 కోట్లు రాబ‌ట్టింది. ఈ సినిమా రాబ‌ట్టిన వ‌సూళ్ల‌కు సంబంధించిన ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.