దుబాయ్ ఆయిల్ కంపెనీలో నయన్–విఘ్నేశ్ రూ.100 కోట్ల పెట్టుబడి!

16-01-2022 Sun 10:52
  • వ్యాపారాలపై దృష్టి పెడుతున్న స్టార్ కపుల్
  • గత నెల దుబాయ్ టూర్ అందుకేనంటున్న కోలీవుడ్
  • ఇన్వెస్ట్ మెంట్ పై అధికారికంగా ప్రకటించని దంపతులు
Nayan and Vignesh Invests In Dubai Oil Company
నయనతార–విఘ్నేశ్ లు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఇద్దరూ కలిసి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఓ చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన నయనతార.. ఇప్పుడు విఘ్నేశ్ తో కలిసి దుబాయ్ లోని ఓ చమురు సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిందని చెబుతున్నారు.

ఒకటి కాదు.. రెండు కాదు.. వారిద్దరూ కలిసి ఏకంగా రూ.100 కోట్లు సదరు సంస్థలో పెట్టుబడి పెట్టినట్టు కోలీవుడ్ లో జోరుగా చర్చ సాగుతోంది. గత నెలలో ఆమె తన కాబోయే భర్త విఘ్నేశ్ తో కలిసి దుబాయ్ ట్రిప్పునకు వెళ్లింది అందుకేనని అంటున్నారు. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సినిమాలు చేస్తూనే రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను ఆమె స్థాపించింది.

కాగా, విఘ్నేశ్ డైరెక్షన్ లోనే వచ్చిన కాథు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నయన్ నటించింది. విజయ్ సేతుపతి, సమంతలు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దాంతో పాటు త్వరలో గాడ్ ఫాదర్, కనెక్ట్, షారూక్ ఖాన్ తో అట్లీ తీయబోయే సినిమాలోనూ నయన్ నటించనుంది.