Bellamkonda Ganesh: బెల్లంకొండ గణేశ్ హీరోగా 'స్వాతిముత్యం' .. గ్లింప్స్ రిలీజ్!

Swathi Muthyam Movie
  • హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయం 
  • కథానాయికగా వర్ష బొల్లమ్మ 
  • లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేశ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు కొంతకాలంగా వార్తలు షికారు చేస్తూ వచ్చాయి. ఆయన హీరోగా 'స్వాతిముత్యం' సినిమా పట్టాలెక్కింది. అయితే కరోనా కారణంగా షూటింగు పరమైన జాప్యం జరుగుతూ వచ్చింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.

 ఇప్పుడు ఈ సినిమా విడుదలకు ముస్తావుతోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి, సంక్రాంతి కానుకగా ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ కి సంబంధించిన సన్నివేశాలను చూస్తుంటేనే, ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం తెలిసిపోతోంది. రావు రమేశ్ కి మంచి క్యారెక్టర్ పడిందనే విషయం అర్థమైపోతోంది.

పెళ్లిలో అల్లుడు .. మామగారి కాళ్లు కడిగేసి, "ఎవరి కాళ్లు ఎవరు కడిగితే ఏవుంది నాన్న"  అంటూ సింపుల్ గా తేల్చేయడం చూస్తుంటే. ఈ సినిమాలో మంచి కామెడీ ఉందనే విషయం తెలుస్తోంది. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నరేశ్ .. శ్రీవాణి .. ప్రగతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
Bellamkonda Ganesh
Varsha Bollamma
Swathi Muthyam Movie

More Telugu News