గుర్రం ఎక్కి సంద‌డి చేసిన బాల‌కృష్ణ‌, మోక్ష‌జ్ఞ‌.. భారీగా వ‌చ్చిన స్థానికులు.. వీడియో ఇదిగో

15-01-2022 Sat 13:28
  • సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సంద‌డి
  • అక్క పురంధేశ్వ‌రి ఇంటికి వెళ్లిన బాల‌య్య‌
  • కారంచేడులో పెద్ద పండగ వాతావరణం   
balakrishna video goes viral
సంక్రాంతి పండుగ‌ను సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఉత్సాహంగా జ‌రుపుకుంటున్నారు. పండుగ సంద‌ర్భంగా ఆయ‌న గుర్రంపై కూర్చొని సంద‌డి చేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా బాలకృష్ణ తన అక్క పురంధేశ్వ‌రి ఇంటికి వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌ భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో ప్రకాశం జిల్లా కారంచేడులో ఉన్నారు.

సంక్రాంతి సంద‌ర్భంగా కొంద‌రు గుర్రం తీసుకురాగా దానిపై ఎక్కి బాలకృష్ణ‌ గుర్రపు స్వారీ చేస్తున్నట్లు పోజు ఇచ్చారు. బాలకృష్ణ కుమారుడు నంద‌మూరి మోక్షజ్ఞ కూడా గుర్రం ఎక్కాడు. కాగా, బాల‌కృష్ణ కారంచేడు వ‌చ్చార‌ని తెలుసుకున్న స్థానికులు ఆయ‌న‌ను చూసేందుకు భారీ సంఖ్య‌లో తరలివ‌చ్చారు. అక్క‌డ ఉన్న గోడ‌లు ఎక్కి మ‌రీ బాల‌య్య చేసిన సంద‌డిని వీక్షించారు.