Railway gaurd: పేరు మార్చుకున్న భారతీయ ‘రైల్వే గార్డ్’!

Indian Railways redesignates post of Guard as Train Manager
  • ట్రెయిన్ మేనేజర్ గా నామకరణం
  • విధులకు తగ్గట్టు ఉండాలని మార్పు
  • బాధ్యతలు, వేతనాల్లో మార్పులు ఉండవన్న  రైల్వే శాఖ  

రైల్వే గార్డ్.. రైలు చివరి పెట్టె ద్వారం వద్ద తెల్లని ప్యాంట్, షర్ట్ ధరించి, చేతిలో గ్రీన్ జెండా పట్టుకుని కనిపించే వ్యక్తి. రైలు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికీ రైల్వే గార్డ్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు రైల్వే గార్డ్ పేరును.. ట్రెయిన్ మేనేజర్ గా రైల్వే శాఖ మార్చింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చేసింది.

గార్డ్ అంటే రక్షకుడు, కాపలాదారుడు అనే అర్థాలు స్ఫుర్తిస్తాయి. కానీ రైల్వే గార్డ్ సేవలు అంతకుమించి ఉంటాయి. కనుక వారిలో మరింత ప్రేరణ కల్పించాలని, వారి విధులు, బాధ్యతలకు అనుగుణంగా ఉండాలని రైల్వే శాఖ పేరులో మార్పును తీసుకొచ్చింది. పేరులోనే తప్ప ఇతరత్రా వారికి సంబంధించి వేతనాలు, బాధ్యతల్లో మార్పు ఉండదని భారతీయ రైల్వే ప్రకటించింది.

రైల్వే గార్డ్ అటు రైలు నడిపే పైలట్ తోను, స్టేషన్ మేనేజర్లతో సమన్వయం చేస్తుంటాడు. ప్రతీ స్టేషన్ నుంచి రైలు వెళ్లేందుకు క్లియరెన్స్ తీసుకుంటాడు. ఎక్కడైనా సిగ్నల్ పరంగా సమస్య ఏర్పడినా, ఇతరత్రా సవాళ్లు ఎదురైనా గార్డ్ సూచనల మేరకు పైలట్ నడుచుకుంటాడు.

  • Loading...

More Telugu News