Sudheer Babu: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నుంచి కొత్త పోస్టర్ .. టీజర్ రెడీ!

  • ఇంద్రగంటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్
  • సుధీర్ బాబుతో మూడో సినిమా
  • వరుస సక్సెస్ లతో ఉన్న కృతి శెట్టి
  • ఈ నెల 17వ తేదీన టీజర్ రిలీజ్  
Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser Release on Jan 17th

సుధీర్ బాబు .. ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో ఇంతకుముందు 'సమ్మోహనం' .. 'వి' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సిద్ధమవుతున్నారు. బెంచ్ మార్క్ - మైత్రీ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ ను వదిలారు. సుధీర్ బాబు - కృతి శెట్టికి సంబంధించిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు.

'ఉప్పెన' .. 'శ్యామ్ సింగ రాయ్' .. 'బంగార్రాజు' సినిమాలతో కృతి శెట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఆమె వరుస సక్సెస్ లు ఈ సినిమాకి ప్లస్ కానున్నాయి. ఇక 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా తరువాత సుధీర్ బాబు నుంచి వస్తున్న ఈ సినిమా, ఆయనకి హిట్ ఇస్తుందేమో చూడాలి.  

More Telugu News