Raghu Rama Krishna Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Case filed against ycp mp raghurama krishna raju in Chintalapudi
  • సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను కులం పేరుతో దూషించారని ఆరోపణ
  • సునీల్ కుమార్ స్వగ్రామమైన చింతలపూడిలో కేసు
  • గొంది రాజు అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌ పై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆయన స్వగ్రామమైన చింతలపూడికి చెందిన గొంది రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు తెలిపారు.

మరోవైపు, పోలీసులు ఇటీవల హైదరాబాద్‌లోని రఘురామరాజు ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. గతంలో నమోదైన కేసుల్లో ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని సూచించారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Chintalapudi
Case

More Telugu News