శబరిమలలో దర్శనమిచ్చిన అయ్యప్య మకరజ్యోతి

14-01-2022 Fri 20:37
  • భక్తులకు మకరవిళక్కు దర్శనం
  • పులకించిన భక్త జనం
  • అయ్యప్ప నినాదాలతో హోరెత్తిన శబరిమల
Ayyappa Makara Jyothi appears at Sabarimala
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఈ సాయంత్రం పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో హోరెత్తించారు. కాగా, ఈ నెల 20న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మూసివేయనున్నారు.  ప్రతి ఏడాది సంక్రాంతి నాడు మకరజ్యోతి దర్శనం ఆనవాయతీగా వస్తోంది. దీన్నే మకరవిళక్కు అని పిలుస్తారు. జ్యోతి కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చి అదృశ్యమవుతుందని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు చెబుతుంటారు.