అక్షయ్ కుమార్ తో సినిమా చేస్తాను: సుకుమార్

14-01-2022 Fri 18:56
  • 'పుష్ప'తో భారీ హిట్ కొట్టిన సుకుమార్ 
  • ప్రస్తుతం సెకండ్ పార్టు పనుల్లో బిజీ
  • బాలీవుడ్ అవకాశాలపై మనసులో మాట
  • అక్షయ్ కాల్ చేశాడన్న సుక్కూ
Sukumar said that he wil do the movie with Akshay Kumar
విభిన్నమైన కథాకథనాలను .. నేపథ్యాలను ఎంచుకుంటూ సుకుమార్ వెళుతున్నాడు. ఎన్టీఆర్ .. చరణ్ ... అల్లు అర్జున్ సినిమాలతో ఆయన హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. 'పుష్ప' సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో దర్శకుడిగా ఆయన సత్తాను చాటింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కి సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడు.

రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఒక ఆసక్తికర్తమైన విషయం చెప్పాడు. బాలీవుడ్ లో ఫలానా హీరోతో సినిమా చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను 'పుష్ప' షూటింగులో ఉండగా అక్షయ్ కుమార్ కాల్ చేసి, తనతో ఒక సినిమా చేయాలని చెప్పి కలవమన్నారు. అందువలన ఆయనతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.

'పుష్ప 2' తరువాత చరణ్ తో సుకుమార్ సినిమా ఉండనుంది. ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ దేవరకొండతో చేయవలసి ఉంది. మరి ఈ రెండు సినిమాల తరువాత అక్షయ్ కుమార్ తో చేస్తాడో, లేదంటే ఈ రెండు సినిమాల మధ్యలో ముంబై వెళ్లి వస్తాడో చూడాలి. మొత్తానికైతే సుకుమార్ - అక్షయ్ కుమార్ కాంబో అయితే ఖరారైపోయినట్టే.