Madhya Pradesh: కరోనా ప్రభంజనం.. మధ్యప్రదేశ్ లో ఈ నెల 31 వరకు స్కూళ్ల బంద్

Schools to shut upto Jan 31 in Madhya Pradesh
  • మధ్యప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసులు
  • నిన్న ఒక్కరోజే 4,031 కేసులు
  • రాజకీయ, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను (1 నుంచి 12వ తరగతి) ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, ఇతర వేడుకలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. మకర సంక్రాంతి స్నానాలపై నిషేధం లేదని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న ఒక్క రోజు మధ్యప్రదేశ్ లో కొత్తగా 4,031 కరోనా కేసులు వచ్చాయి. ముగ్గురు మరణించారు. పాజిటివిటీ రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది.

  • Loading...

More Telugu News