చిరంజీవి క్లాప్ తో రవితేజ 'రావణాసుర' సినిమా ప్రారంభం!

14-01-2022 Fri 15:15
  • భోగి పర్వదినాన 'రావణాసుర' షూటింగ్ ప్రారంభం
  • చిరంజీవి క్లాప్ కొట్టగా.. కెమెరా స్విచ్చాన్ చేసిన మంత్రి తలసాని
  • సెప్టెంబర్ 30న విడుదల కానున్న చిత్రం
Raviteja movie Ravanasura shooting started with Chiranjeevi as Chief guest
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'రావణాసుర' చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన పూజా కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విచ్చేశారు. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్క్రిప్ట్ అందించారు. ముహూర్తపు సన్నివేశాన్ని రవితేజపై చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టగా, శ్రీనివాస్ యాదవ్ స్విచ్చాన్ చేశారు. ప్రారంభ సన్నివేశానికి డైరెక్టర్లు కేయస్ రవీంద్ర, గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. 'రావణాసుర' పోస్టర్ ను చిరంజీవి లాంచ్ చేశారు.

ఈ సినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్ బ్యానర్స్ ఈ సినిమాను నిర్విస్తున్నాయి. ఈ నెలలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. 2022 సెప్టెంబర్ 30 ఈ చిత్రం విడుదల కానుంది.