Chandraiah: టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసు.. 8 మంది నిందితుల అరెస్ట్!

8 arrested in Chandraiah murder case
  • గుంటూరు జిల్లా గుండ్లపాడులో దారుణ హత్య
  • కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు
  • చంద్రయ్య పాడెను మోసిన చంద్రబాబు
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత చంద్రయ్యను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. కాసేపట్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు.

చంద్రయ్య నిన్న దారుణ హత్యకు గురయ్యారు. గుండ్లపాడు గ్రామ సెంటర్ లో కూర్చున్న సమయంలో ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో హత్య చేసి హతమార్చారు. ఆ వెంటనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. టీడీపీ శ్రేణులు హత్యను తీవ్రంగా ఖండించాయి. ఇది వైసీపీ వాళ్లు చేసిన రాజకీయ హత్య అని ఆరోపించాయి. మరోవైపు చంద్రయ్య అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన పాడెను కూడా మోశారు.
Chandraiah
Murder
Guntur District
Veldurthi
Accused
Arrest

More Telugu News