'ఈ సినిమా చూశాను.. విప‌రీతంగా న‌చ్చింది' అన్న‌ మ‌హేశ్ బాబు.. వీడియో ఇదిగో

14-01-2022 Fri 13:16
  • రేపు 'హీరో' సినిమా విడుద‌ల‌
  • హీరోగా అశోక్ గల్లా ప‌రిచ‌యం
  • అశోక్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడన్న మ‌హేశ్
  • అత‌డిని చూసి గ‌ర్విస్తున్నానని వ్యాఖ్య‌
  • సంక్రాంతి పండుగ త‌మ‌కు క‌లిసి వ‌స్తోంద‌న్న మ‌హేశ్‌
Maheshbabu watched HERO and loved it a lot
యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అశోక్ గల్లా, నిధి అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపుదిద్దుకున్న 'హీరో' సినిమాపై మ‌హేశ్ బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ఈ సినిమా రేపు సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల కానుంది. ఈ సినిమాను చూసిన మ‌హేశ్ బాబు ఓ ప్ర‌త్యేక వీడియోలో ఈ సినీ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. 'ఈ సినిమా చూశాను.. నాకు విప‌రీతంగా న‌చ్చింది. ఈ సినీ బృందానికి నా శుభాకాంక్ష‌లు' అని వ్యాఖ్యానించాడు.

'ముఖ్యంగా అశోక్ చాలా బాగా న‌టించాడు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అత‌డిని చూసి గ‌ర్విస్తున్నాను. నేను ఎల్ల‌ప్పుడూ న‌మ్ముతాను, మ‌నం హార్డ్ వ‌ర్క్ చేస్తే విజ‌యం సాధిస్తాం. ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్లంద‌రికీ శుభాకాంక్ష‌లు. సంక్రాంతి పండుగ నాన్న‌కు క‌లిసి వ‌చ్చిన రోజు. నాకు కూడా బాగా క‌లిసివ‌చ్చింది' అని మ‌హేశ్ బాబు తెలిపాడు.

'ఒక్క‌డు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు.. వంటి సినిమాలు సంక్రాంతికి వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అశోక్‌ గ‌ల్లా సినిమా కూడా సంక్రాంతికే వ‌స్తోంది. నాన్న గారి అభిమానులు, నా అభిమానులు అశోక్ గ‌ల్లానూ అభిమానిస్తార‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను' అని మ‌హేశ్ బాబు చెప్పాడు.

కాగా, ఈ సినిమాలో జగపతి బాబు, నరేశ్‌, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ త‌దిత‌రులు నటించారు. ఈ సినిమాకి శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఘిబ్రాన్ సంగీతం అందించారు.