Kuwait: 866 మంది విదేశీయులను బహిష్కరించిన కువైట్.. ఎక్కువ మంది భారతీయులే!

Kuwait deported 866 foreigners
  • మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న కువైట్
  • 2021లో 886 మందిపై డ్రగ్స్ కేసుల నమోదు
  • కొన్నేళ్లుగా కువైట్ లో పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న మాదకద్రవ్యాలు
నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులపై కువైట్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కూడా కొరడా ఝుళిపిస్తోంది. మాదకద్రవ్యాల కేసులు నమోదైన విదేశీయుల విషయంలో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి వారందరినీ బహిష్కరించింది.

2021లో ఆ దేశంలో 886 మంది విదేశీయులపై డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో వీరందరినీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం దేశం నుంచి బహిష్కరించింది. డ్రగ్స్ కేసులు నమోదైన వారిలో ఎక్కువ మంది భారతీయులు, ఈజిప్ట్ కు చెందిన వ్యక్తులు ఉన్నారు. కొన్నేళ్లుగా కువైట్ లో మాదకద్రవ్యాలు పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి.
Kuwait
866 Foreigners
Deportation

More Telugu News