'హీరో' నుంచి 'బుర్రపాడవుతాదే' మాస్ సాంగ్!

14-01-2022 Fri 10:32
  • 'హీరో'గా అశోక్ గల్లా
  • కథానాయికగా నిధి అగర్వాల్
  • సంగీత దర్శకుడిగా గిబ్రాన్
  • రేపు ప్రేక్షకుల ముందుకు  
Hero Mass Song Released
అశోక్ గల్లా 'హీరో' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రేపు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై కొరటాల .. అనిల్ రావిపూడి .. రాధాకృష్ణ కుమార్ .. శివ నిర్వాణ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

తాజాగా సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ ను వదిలారు. "బుర్రపాడవుతదే బుంగమూతి పిట్టకే .. బుర్రపాడవుతదే సన్నా నడుం తిప్పకే" అంటూ ఈ పాట సాగుతోంది. గిబ్రాన్ అందించిన బీట్ బాగుంది .. చాలా కలర్ఫుల్ గా ఈ పాటను చిత్రీకరించారు. సాహిత్యం కూడా సందర్భానికి తగినట్టుగా .. యూత్ కి పట్టేదిగా ఉంది.

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాట చూస్తుంటే, సింగర్స్ వాయిస్ ఇద్దరికీ మ్యాచ్ కాలేదని అనిపిస్తుంది. ముఖ్యంగా నిధి అగర్వాల్ కి ఆ వాయిస్ ఎంత మాత్రం సెట్ కాకపోవడం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. సంక్రాంతి పండగకి పెర్ఫెక్ట్ సినిమా అని చెప్పుకుని వస్తున్న ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.