Andhra Pradesh: ఏపీ సర్కారు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించిన కేంద్రం

Centre appreciates AP Govt  vaccination program
  • సీఎంలతో మోదీ వర్చువల్ సమావేశం
  • కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష
  • రాష్ట్రాలకు సూచనలు
  • కరోనా నివారణలో వ్యాక్సినే ప్రధాన ఆయుధం అని వెల్లడి
కరోనా కల్లోలం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీ నిర్వహించారు. ఈ సమీక్షకు ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఏపీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారికి అత్యధికంగా వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రశంసించింది.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్లు ఇచ్చినట్టు వెల్లడించారు. పండుగ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, కరోనా నియంత్రణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సినే ప్రధాన ఆయుధం అని మోదీ వివరించారు.
Andhra Pradesh
Govt
Vaccination
Narendra Modi
Corona Virus
India

More Telugu News