Rishabh Pant: కేప్ టౌన్ లో పంత్ సెంచరీ... దక్షిణాఫ్రికా టార్గెట్ 212 రన్స్

Pant completes century in Cape Town test
  • ఆసక్తికరంగా చివరి టెస్టు 
  • పేసర్లకు విశేషంగా సహకరిస్తున్న కేప్ టౌన్ పిచ్
  • 133 బంతుల్లో 100 పరుగులు చేసిన పంత్
  • రెండో ఇన్నింగ్స్ లో 198 పరుగులకు భారత్ ఆలౌట్ 
కేప్ టౌన్ టెస్టులో టీమిండియా... సఫారీల ముందు 212 పరుగుల విజయలక్ష్యాన్నుంచింది. పిచ్ పరిస్థితి చూస్తుంటే లక్ష్యఛేదన ఏమంత సులువు కాదని తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 198 పరుగులకు ఆలౌటైంది. 2 పరుగులు చేసిన బుమ్రా చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. పంత్ 100 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 4, రబాడా 3 ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు.

 కాగా, రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించని పిచ్ పై ఎంతో సంయమనంతో ఆడిన పంత్ 133 బంతుల్లో 100 పరుగులు చేశాడు. పంత్ స్కోరులో 6 ఫోర్లు 4 సిక్సులున్నాయి.
Rishabh Pant
Century
Cape Town
Team India
South Africa

More Telugu News