BV Raghavulu: బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది: బీవీ రాఘవులు

  • ఇటీవల కేసీఆర్ తో వామపక్ష నేతల సమావేశం
  • కేంద్రంపై వామపక్షాలు పోరాడతాయన్న రాఘవులు
  • హక్కుల కోసం రాష్ట్రాలు కలిసిరావాలని సూచన
  • బీజేపీతో తెలంగాణకు ముప్పుందన్న తమ్మినేని వీరభద్రం
BV Raghavulu comments on latest developments

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో హైదరాబాదులో వామపక్ష నేతలు సమావేశం కావడం తెలిసిందే. ఈ క్రమంలో సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు స్పందించారు. హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కలిసి పోరాడుదామని కేసీఆర్ ను కేరళ సీఎం పినరయి విజయన్ కోరారని రాఘవులు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోరాటాలకు సిద్ధమవుతోందని రాఘవులు వెల్లడించారు.

సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, కేసీఆర్ మెతక వైఖరి వల్లే తెలంగాణలో బీజేపీ బలపడుతోందని అన్నారు. బీజేపీపై కేసీఆర్ బహిరంగ పోరాటం చేయాలని పేర్కొన్నారు. విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్న బీజేపీతో తెలంగాణకు ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు.

More Telugu News