'బంగార్రాజు'కి కూడా సీక్వెల్ ఉండొచ్చు: నాగార్జున

13-01-2022 Thu 17:12
  • 'బంగార్రాజు'పై అంచనాలు ఉన్నాయి
  • రమ్యకృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు 
  • చైతూలో కొత్త కోణం చూస్తారు 
  • కృతిశెట్టి గొప్పగా చేసిందన్న నాగ్
Bangarraju Movie Update
నాగార్జున కథానాయకుడిగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ 'బంగార్రాజు' సినిమాను రూపొందించాడు. యాక్షన్ .. రొమాన్స్ తో పాటు ఫాంటసీ టచ్ తో సాగే కథ ఇది. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాను, రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి.

 తాజా ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ .. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం వలన, సహజంగానే ఈ సినిమాపై మరింతగా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో చైతూలోని కొత్త యాంగిల్ ను చూస్తారు. తను అంత బాగా చేస్తాడని నేను కూడా అనుకోలేదు.

ఇక నాతో రమ్యకృష్ణ జోడీ ఎలా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కృతిశెట్టి చాలా తక్కువ సమయంలో తెలుగు నేర్చేసుకుంది. ఆమె అంకితభావం చూసి నాకు ముచ్చటేసింది. 'బంగార్రాజు' ఎప్పుడంటే అప్పుడు భూమ్మీదకు వస్తుంటాడు గనుక, ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.