కరోనా నుంచి కోలుకున్న మంచు లక్ష్మి

13-01-2022 Thu 16:58
  • ఇటీవల కరోనా బారిన పడిన మంచు లక్ష్మి
  • ఇప్పుడు తనకు నెగెటివ్ వచ్చిందని వెల్లడి
  • తన కూతురుని ముద్దులాడిన లక్ష్మి
Manchu Lakshmi recovered from Corona
సినీ పరిశ్రమపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తెలుగు పరిశ్రమకు చెందిన మహేశ్ బాబు, మంచు లక్ష్మి, మనోజ్, తమన్, మీనా, త్రిష తదితరులకు కరోనా సోకింది. తాజాగా మంచు లక్ష్మి కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలిపారు. 'హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడీ. ఐయాం నెగెటివ్' అని ఆమె తెలిపారు. అంతేకాదు లక్ష్మీ, ఆమె కూతురు ఇద్దరూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం వీడియోలో ఉంది.